ఒలింపిక్‌‌ క్వాలిఫికేషన్ మార్క్ అందుకున్నరాంబాబు

ఒలింపిక్‌‌ క్వాలిఫికేషన్ మార్క్ అందుకున్నరాంబాబు

న్యూఢిల్లీ : ఇండియా రేస్ వాకర్ రాంబాబు మెన్స్‌‌‌‌ 20 కి.మీ రేస్‌‌‌‌లో  పారిస్ ఒలింపిక్స్‌‌‌‌ క్వాలిఫికేషన్ మార్కు అందుకున్నాడు.స్లోవేకియాలో జరిగిన దుడిన్‌‌‌‌స్కా 50 మీట్‌‌‌‌లో రాంబాబు తన పర్సనల్ బెస్ట్ టైమింగ్‌‌‌‌ 1:20:00తో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ గెలిచాడు.  ఈ క్రమంలో ఒలింపిక్ క్వాలిఫికేషన్ కటాఫ్ మార్క్‌‌‌‌ అయిన  1:20:10 టైమింగ్‌‌‌‌ను దాటాడు. ఈ టోర్నీలో పోడియం ఫినిష్‌‌‌‌ చేసిన తొలి ఇండియన్‌‌‌‌గానూ నిలిచాడు.

కాగా, పారిస్ ఒలింపిక్స్‌‌‌‌  క్వాలిఫికేషన్ మార్కు దాటిన  ఏడో ఇండియన్‌‌‌‌ రాంబాబు. అతనికంటే ముందు అక్ష్‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌, సూరజ్ పన్వార్, సెర్విన్‌‌‌‌ సెబాస్టియన్‌‌‌‌, అర్ష్‌‌‌‌ప్రీత్ సింగ్‌‌‌‌, ప్రామ్‌‌‌‌జీత్ బిష్త్‌‌‌‌, వికాస్‌‌‌‌ ఈ మార్కు దాటారు. విమెన్స్‌‌‌‌లో ప్రియాంక గోస్వామి ఈ లిస్ట్‌‌ లో ఉంది. అయితే, ఒక  వ్యక్తిగత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌‌‌‌లో  ఓ దేశం నుంచి  ముగ్గురు అథ్లెట్లను మాత్రమే ఒలింపిక్స్‌‌‌‌కు అనుమతిస్తారు.