IND vs ENG 2025: నితీష్, అర్షదీప్ ఔట్.. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు టీమిండియా స్క్వాడ్ ప్రకటన

IND vs ENG 2025: నితీష్, అర్షదీప్ ఔట్.. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు టీమిండియా స్క్వాడ్ ప్రకటన

మాంచెస్టర్‌ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. మొత్తం 17 మందితో కూడిన స్క్వాడ్ ను సోమవారం (జూలై 21) బీసీసీఐ ప్రకటించింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. "ఎడమ మోకాలి గాయం కారణంగా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. నితీష్ స్వదేశానికి వెళ్తాడు. అతను త్వరగా కోలుకోవాలని జట్టు కోరుకుంటుంది" అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.

Also Read:-ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్.. ఛాంపియన్స్ లీగ్ టీ20కి ఐసీసీ గ్రీన్ సిగ్నల్

లెఫ్టర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నాలుగో టెస్టుకు మాత్రమే దూరమయ్యాడు. "మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే నాలుగో టెస్ట్‌కు అర్ష్‌దీప్ సింగ్ దూరమయ్యాడు. బెకెన్‌హామ్‌లో జరిగిన శిక్షణా సెషన్‌లో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమ బొటనవేలికి గాయమైంది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షనలో ఉన్నాడు". అని బీసీసీఐ తెలిపింది. మాంచెస్టర్ టెస్టుకు యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులో చేర్చింది. జస్ప్రీత్ బుమ్రా స్క్వాడ్ లో ఉన్నప్పటికీ అతడు తుది జట్టులో ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే, జట్టు యాజమాన్యం ఎవరిని ఆడిస్తుందో ఆసక్తికరంగా మారింది. 

ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్‎లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్‎లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 2025, జూలై 23న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్‌‎లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లురుతున్నాయి.

ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టుకు ఇండియా స్క్వాడ్:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్