Champions League T20: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్.. ఛాంపియన్స్ లీగ్ టీ20కి ఐసీసీ గ్రీన్ సిగ్నల్

Champions League T20: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్.. ఛాంపియన్స్ లీగ్ టీ20కి ఐసీసీ గ్రీన్ సిగ్నల్

ఛాంపియన్స్ లీగ్ టీ20.. 11 ఏళ్ళ క్రితం ఈ మెగా టోర్నీ చివరి సారిగా జరిగింది. క్రికెట్ ఆదరణ ఉన్న దేశాలు తమ దేశంలో ఒక డొమెస్టిక్ లీగ్ నిర్వహించుకుంటారు. ఆయా దేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు చాంపియన్స్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. 2009 నుంచి 2014 వరకు మొత్తం ఆరు సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. అభిమానుల నుండి పెద్దగా ఆదరణ రాకపోవడంతో ఈ మెగా టోర్నీని నిలిపివేశారు. ఇదిలా ఉంటే ఈ టోర్నీని 2026లో మరోసారి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. 

పురుషుల ట్వంటీ 20 ఛాంపియన్స్ లీగ్ పునఃప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది (2026)సెప్టెంబర్ నాటికి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక తెలిపింది. ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం.. ఇటీవలే సింగపూర్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో అనేక క్రికెట్ బోర్డులు ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) పునరుద్ధరణకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ మెగా లీగ్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు సమాచారం. 2009 నుండి 2014 వరకు జరిగిన ఈ టోర్నమెంట్‌లో పంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టీ20 ఫ్రాంచైజీలు ఆడనున్నాయి. 
 
మొదట 2009లో ప్రారంభించబడిన ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) ఒకప్పుడు ఫుట్‌బాల్ యొక్క UEFA ఛాంపియన్స్ లీగ్ యొక్క క్రికెట్ వెర్షన్‌గా పరిగణించబడింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన టీ20 టోర్నమెంట్‌ల నుండి ఏడు అత్యుత్తమ ప్రదర్శన కలిగిన దేశీయ జట్లు ఒకే టోర్నమెంట్‌లో పోటీ పడనున్నాయి.ఈ ఫార్మాట్ పాత ఛాంపియన్స్ లీగ్ టీ20 మాదిరిగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర టీ20 లీగ్‌ల విజేతలు కొత్త టోర్నమెంట్‌లో ఆడతారు. ఇందులో ఐపీఎల్, ది హండ్రెడ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ లలో విజేతగా నిలిచిన జట్లు ఆడతాయి. జట్ల సంఖ్య లేదా ఏ లీగ్‌లు పాల్గొంటాయనే వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు.

ALSO READ : PAK vs BAN: నాలుగు ఓవర్లలో 6 పరుగులు..పాక్‌పై ముస్తాఫిజుర్ మైండ్ బ్లోయింగ్ స్పెల్

2009 నుంచి 2014 వరకు మొత్తం ఆరు సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. వీటిలో రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్, రెండు సార్లు ముంబై ఇండియన్స్ విజేతలుగా నిలిచాయి. ఆస్ట్రేలియా జట్లు న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్లు ఒక్కోసారి విజేతగా నిలిచాయి.చివరిసారిగా ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్ ఐపీఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మధ్య జరిగింది. బెంగళూరులో జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.