ఫస్ట్ వన్డేలో భారత్ ఇరగదీసింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 237 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేసింది. విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు మిస్టర్ కూల్ ధోనీ. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది టీమిండియా. కేదార్ జాదవ్, ధోనీలు కలిసి ఇండియాకు అద్భుతమైన గెలుపును అందించారు.
భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(37), విరాట్ కోహ్లి(44), ఎంఎస్ ధోని(59 నాటౌట్), కేదర్ జాదవ్(81 నాటౌట్)లు రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.

