IND vs ENG 2025: ఈ లాజిక్ ఎక్కడ పట్టారు బాస్.. వింత సెంటిమెంట్‌తో బుమ్రాపై నెటిజన్స్ ట్రోలింగ్

IND vs ENG 2025: ఈ లాజిక్ ఎక్కడ పట్టారు బాస్.. వింత సెంటిమెంట్‌తో బుమ్రాపై నెటిజన్స్ ట్రోలింగ్

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఇంగ్లాండ్ టూర్ కు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు బుమ్రా కీలకమని.. ఈ పేసర్ ను కాపాడుకుంటూ వచ్చారు. అంచనాలకు తగ్గట్టుగానే బుమ్రా తాను ఆడిన మూడు టెస్టుల్లో రాణించాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు పక్కనపెడితే లీడ్స్, లార్డ్స్ లో 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పడు ఒక కొత్త సెంటిమెంట్ టీమిండియా ఫ్యాన్స్ ను వింత అనుభవానికి గురి చేస్తోంది. అదేంటో కాదు బుమ్రా భారత టెస్ట్ జట్టులో ఉంటే మన జట్టు గెలవడం కంటే ఎక్కువగా ఓడిపోతుంది. 

ALSO READ | IND vs ENG 2025: అప్పుడు గాటింగ్.. ఇప్పుడు బ్రూక్: టాప్ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ జట్టును ముంచేశారు

అదే సమయంలో బుమ్రా ఆడని మ్యాచ్ ల్లో భారత జట్టు టెస్టుల్లో అద్భుత విజయాలను సాధిస్తూ వచ్చింది. తాజాగా ఇంగ్లాండ్ తో ముగిసిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఇండియా 2-2 తో  సిరీస్ సమం చేసింది. ఇండియా గెలిచిన రెండు టెస్టుల్లో బుమ్రా లేకపోవడం విశేషం. బుమ్రా ఆడిన మూడు టెస్టుల్లో రెండు మ్యాచ్ ల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. అంతకముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్ లాడితే టీమిండియా కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచింది. దీంతో ఇప్పుడు బుమ్రాపై సరదాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. 

బుమ్రా తప్పుకొని టీమిండియాకు విజయాన్ని అందించాడని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. కొంతమందైతే  టీమిండియా టెస్ట్ మ్యాచ్ లు గెలవాలంటే బుమ్రాకు మరింత రెస్ట్ అవసరమని కామెంట్ చేస్తున్నారు. బుమ్రా టీమిండియా తరపున ఇప్పటివరకు 48 టెస్టులు ఆడాడు. వీటిలో భారత్ 20 మ్యాచ్ ల్లో గెలిస్తే మరో 23 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.  2018లో బుమ్రా అరంగేట్రం చేసినప్పటి నుండి బుమ్రా ఆడని 28 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇండియా ఐదు మాత్రమే ఓడిపోయింది. 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. మరో మూడు డ్రాగా ముగిశాయి.

ఇప్పటికే ఆడిన మూడు టెస్టుల్లో బుమ్రా.. ఎడ్జ్ బాస్టన్, ఓవల్ టెస్ట్ లకు దూరమయ్యాడు. తొలి టెస్టుతో పాటు లార్డ్స్, మాంచెస్టర్ టెస్టులో బరిలోకి దిగాడు. 31 ఏళ్ల బుమ్రా మొదటి మూడు టెస్ట్‌లలో 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. హెడింగ్లీ, లార్డ్స్‌లో ఐదు వికెట్ల హాల్ ఉన్నాయి. లీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు.  లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. మాంచెస్టర్ టెస్టులో 33 ఓవర్లలో 112 పరుగులు సమర్పించుకున్న బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు.