ఏటీపీ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌–1000 టోర్నీ: సెమీస్‌‌‌‌‌‌‌‌లో యూకీ జోడీ

 ఏటీపీ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌–1000 టోర్నీ: సెమీస్‌‌‌‌‌‌‌‌లో యూకీ జోడీ

ఇండియన్‌‌‌‌‌‌‌‌ వేల్స్‌‌‌‌‌‌‌‌ (అమెరికా): ఇండియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ యూకీ భాంబ్రీ.. తొలిసారి ఏటీపీ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌–1000 టోర్నీలో సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో యూకీ–ఆండ్రీ గొరాన్‌‌‌‌‌‌‌‌సెన్‌‌‌‌‌‌‌‌ (స్వీడన్‌‌‌‌‌‌‌‌) 6–3, 7–6తో అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ ఎర్లర్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రియా)–ఆండ్రియా వావాసోరి (ఇటలీ)పై నెగ్గారు. 33 ఏళ్ల యూకీ గతంలో మాస్టర్స్‌‌‌‌‌‌‌‌–1000 లెవెల్‌‌‌‌‌‌‌‌లో రెండుసార్లు డబుల్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరినా విజయం సాధించలేకపోయాడు. 

ఇక గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో యూకీ ద్వయం పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. తమ సర్వీస్‌‌‌‌‌‌‌‌లో 83 శాతం పాయింట్లు గెలుచుకుంది. రెండో సెట్‌‌‌‌‌‌‌‌ టైబ్రేక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినా చివర్లో వరుస పాయింట్లతో హోరెత్తించింది. శుక్రవారం జరిగే సెమీస్‌‌‌‌‌‌‌‌లో యూకీ జోడీ.. ఆర్థర్‌‌‌‌‌‌‌‌ రిండర్‌‌‌‌‌‌‌‌క్నెచ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)–వాలెంటిన్‌‌‌‌‌‌‌‌ వాచెరోట్‌‌‌‌‌‌‌‌ (మొనాకో)తో తలపడతారు.