హైదరాబాద్, వెలుగు: బెంగళూరు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు ఇండియావుడ్ 2026 ప్రదర్శన జరగనుంది. వుడ్ వర్కింగ్, ఫర్నిచర్ తయారీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సదస్సుగా ఇది నిలవనుంది. 50 దేశాల నుంచి వెయ్యికి పైగా బ్రాండ్లు ఇందులో పాల్గొంటున్నాయి.
సుమారు 90 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. ఈ ప్రదర్శనలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ సాంకేతికత, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం భారత తయారీ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి వేదిక అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
