హైదరాబాద్ లో డ్రేపర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం

హైదరాబాద్ లో  డ్రేపర్ ఫౌండర్స్  ప్రోగ్రామ్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది ఎంట్రపెనార్లను తయారు చేయడంలో భాగంగా భారతదేశంలో తొలి డ్రేపర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ ప్రారంభించామని గ్లోబల్ ఎంటర్​ప్రెన్యూర్‌‌‌‌షిప్ ఎకోసిస్టమ్ డ్రేపర్ స్టార్టప్ హౌస్ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా దీనిని 12 రోజులపాటు నిర్వహిస్తున్నామని ప్రకటించింది. 

దేశం నలుమూలల నుంచి వచ్చిన 14 మంది స్టార్టప్ ఫౌండర్లను ఒకచోట చేర్చి,   ప్రాక్టికల్ స్కిల్స్, మెంటారింగ్, గ్లోబల్ కనెక్టివిటీ అందిస్తారు.  ఈ కార్యక్రమం వీరికి మెంటార్‌‌‌‌షిప్, వనరులు, నెట్‌‌‌‌వర్కింగ్ అవకాశాలను అందిస్తుంది. ఇది భారతదేశ స్టార్టప్ ఎకోసిస్టమ్​ను మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను తెలియజేస్తుందని  డ్రేపర్ స్టార్టప్ హౌస్ తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా కొత్త ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంది.