భారతదేశ అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులో కీలక ముందడుగు: సుబన్సిరి యూనిట్ టెస్ట్ రన్ ప్రారంభం!

భారతదేశ అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులో కీలక ముందడుగు: సుబన్సిరి యూనిట్ టెస్ట్ రన్ ప్రారంభం!

అరుణాచల్ ప్రదేశ్-అస్సాం సరిహద్దులో ఉన్న భారతదేశంలోని అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులోని ఎనిమిది యూనిట్లలో ఒకదాని  టెస్ట్ రన్‌ మొదలైంది,  దీని బట్టి త్వరలోనే ప్రారంభించనున్నట్లు  తెలుస్తుంది.

2,000 మెగావాట్ల సుబన్సిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టులోని మొదటి 250 మెగావాట్ల యూనిట్ వెట్ కమీషనింగ్ శుక్రవారం ప్రారంభమైనట్లు NHPC లిమిటెడ్ అధికారులు తెలిపారు. వెట్ కమీషనింగ్ అనేది ప్రాథమికంగా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా చాల పారామితులను చెక్ చేయడానికి టర్బైన్ యొక్క టెస్ట్ రన్. నీటి ప్రవాహంతో టెస్ట్ రన్ నాలుగు నుండి ఐదు రోజులు పట్టవచ్చు అని NHPC ప్రతినిధి తెలిపారు.

సుబన్సిరి లోయర్ ప్రాజెక్టులో 250 మెగావాట్ల ఎనిమిది యూనిట్లు ఉన్నాయి. వీటిలో నాలుగు యూనిట్లు టెస్టింగ్ కోసం రెడీగా ఉన్నాయి. తరువాత  దశలో కనీసం రెండు యూనిట్లను సింక్రొనైజ్  ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దులోని గెరుకాముఖ్ వద్ద ఉన్న సుబన్సిరి లోయర్ ప్రాజెక్టును జనవరి 2005లో ప్రారంభించారు. అస్సాంలో  ఆనకట్ట వ్యతిరేక కార్యకర్తల నిరసనలు, దిగువ పర్యావరణ ప్రభావాలపై ఆందోళనల కారణంగా ఈ ప్రాజెక్టు పనులు 2011లో నిలిపివేయబడ్డాయి.

ప్రధానమంత్రి కార్యాలయం దీనిని పూర్తి చేయాలని ఒత్తిడి చేయడంతో NHPC భద్రతా చర్యలను చేపట్టిన తర్వాత 2019 అక్టోబర్‌లో  పనులు తిరిగి ప్రారంభమైంది. వెట్ కమీషనింగ్ కార్యక్రమానికి హాజరైన NHPC చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భూపేందర్ గుప్తా, ఈ విజయం కార్పొరేషన్ యొక్క ఇంజనీరింగ్ స్కిల్స్ నిదర్శనం అని పేర్కొన్నారు. ఇది ఒక ప్రాజెక్ట్ మైలురాయి కంటే ఎక్కువ,  ఈ ప్రాజెక్టు పూర్తి కావడం భారతదేశానికి శుభ్రమైన, పచ్చని, స్వయం-సమృద్ధి కలిగిన ఇంధన భవిష్యత్తు వైపు ఒక కీలక ముందడుగు అని ఆయన అన్నారు.