జులైలో టీమిండియా శ్రీలంక పర్యటన..కెప్టెన్‌గా శిఖర్‌

జులైలో టీమిండియా శ్రీలంక పర్యటన..కెప్టెన్‌గా శిఖర్‌

టీమిండియా వచ్చే నెల(జులై)లో శ్రీలంకలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 2 T20లు ఆడనుంది. దీనికి సంబంధించి  కెప్టెన్ బాధ్యతలను బిసిసిఐ శిఖర్‌ ధావన్‌కు అప్పగించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఈనెల 18 నుంచి జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆడేందుకు సౌతాంప్టన్‌ వెళ్లారు. వారు అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్సీ పగ్గాలను BCCI ధావన్‌కు అప్పగించింది. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. 20 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన బిసిసిఐ.. పలువురు దేశవాళీ ఆటగాళ్లకు స్థానం కల్పించింది. అయితే.. టి.నటరాజన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హర్షల్‌ పటేల్‌ జట్టులో స్థానం లభించలేదు. నటరాజన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ కారణంగానూ.. హర్షల్‌ పటేల్‌ వయసు పరంగానూ జట్టులో స్థానం దక్కించుకోలేక పోయారు.

భారత జట్టు : శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), యుజ్వేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కె.గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.