ఇండిగో లాభం 62 శాతం జంప్.. నాలుగో క్వార్టర్లో రూ.3,068 కోట్లు

ఇండిగో లాభం 62 శాతం జంప్.. నాలుగో క్వార్టర్లో రూ.3,068 కోట్లు

న్యూఢిల్లీ: మనదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో  పేరెంట్​ కంపెనీ ఇంటర్‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్  మార్చి 2025తో ముగిసిన క్వార్టర్​లో రూ.3,067.5 కోట్ల నికరలాభం సాధించింది. ఏడాది లెక్కన ఇది 62 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

గత సంవత్సరం ఇదే కాలంలో పన్ను తర్వాత లాభం రూ.1,894.8 కోట్లుగా ఉంది. 2024–-25 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో మొత్తం ఆదాయం రూ.23,097.5 కోట్లకు పెరిగింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో రూ.18,505.1 కోట్లుగా ఉంది.  2024–-25లో ఈ విమానయాన సంస్థ 11.8 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించింది.

కంపెనీ బోర్డు రూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ. 10 చొప్పున డివిడెండ్‌‌‌‌ను సిఫార్సు చేసింది.