బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రామరాజ్యం ఉందా?

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రామరాజ్యం ఉందా?

షర్మిళను విమర్శించే స్థాయి ఎంపీ అర్వింద్‌కు లేదని వైఎస్ షర్మిళ అనుచరురాలు ఇందిరా శోభన్ అన్నారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిళకు అవగాహన లేదనడం సరికాదని ఆమె మండిపడ్డారు. ‘అయిదు రోజుల్లో పసుపు బోర్డు సాధ్యం కాదని తెలిసి కూడా అర్వింద్ రైతులను మోసం చేశాడు. విశ్వసనీయతకు రాజన్న మారుపేరు. రామరాజ్యం ఎవరు చూడలేదు? మోడీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రామరాజ్యం ఉందా? మహిళలపై జరుగుతున్న దాడుల్లో యూపీ మొదటి స్థానంలో ఉంది. సామాన్యులు బతకలేని స్థితికి యూపీని మోడీ తీసుకొచ్చారు. పేదోన్ని కొట్టి పెద్దోన్ని బతికియ్యాలి అనేలా మోడీ పాలన ఉంది. ప్రజలకు పసుపు బోర్డు హామీ ఇచ్చారు కదా దానిపైన మాట్లాడాలి. 10 వేల మద్దతు ధర లభిస్తుందంటూ అర్వింద్ అబద్దాలు చెప్తున్నారు. పసుపు బోర్డ్‌పై బాండ్ పేపర్ ఇచ్చావు. ఏమైంది పసుపు బోర్డ్? సిస్టర్ అంటూ వెటకారపు మాటలు మాట్లాడొద్దు. భావోద్వేగాలతో ప్రజల కడుపు నిండదు. రోజురోజుకీ బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది’ అని ఇందిరా శోభన్ అన్నారు.