రాష్ట్ర మహిళలు అన్నిరంగాల్లో రాణించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలతో మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇందిరమ్మ పేరుతో ఇండ్లు, చీరలు అందజేసిన సర్కార్ తాజాగా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయడంతో అక్కచెల్లెళ్లు సంబురపడుతున్నారు.
మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం నియోజకవర్గంలోని పోరెడ్డిగూడెం గ్రామంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం చేయించారు. ఈ వేడుకలో మహిళలు ఇందిరమ్మ చీరలు ధరించి సందడి చేశారు. కొత్తగా గృహ ప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇంటి వద్ద ఇందిరమ్మ చీరలు ధరించి కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేయడం విశేషం. –నల్గొండ, వెలుగు:
