హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలోని నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఇంకా ఏడాదికి రూ. 6 లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులెవరైనా క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసేందుకు అర్హులే అని ఆ సంస్థ ఎండీ, హౌసింగ్ బోర్డు కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఈమేరకు సోమవారం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేశారు.
సొంత ఇళ్లు లేని వాళ్లు, ఒక కుటుంబంలో ఒకరు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారు తన వాటాగా రూ. 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సిటీలోని ఏ నియోజకవర్గానికి చెందినవారు ఆ నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
