ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే
  • తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇండ్లు
  • దివ్యాంగులు, వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుధ్య కార్మికుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫస్ట్​ ప్రయారిటీ 
  • ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ధిదారు ఆస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్తి చూపితే అద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పు గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దుల నిర్మాణానికి అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి
  • ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిధిలో ప్రత్యేక కోటా
  • మహబూబ్​నగర్, మెదక్, నిజామాబాద్​, కొత్తగూడెంజిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్​  
  • ఇందిరమ్మ ఇండ్ల విధివిధానాలపై సీఎం రేవంత్ సమీక్ష

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్, వెలుగు: త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన (పీఎంఏవై) గైడ్​లైన్స్​కు తగ్గట్టుగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను మొదలుపెట్టనున్నది. నిబంధనలు, ఇండ్ల సంఖ్య కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ కొంత ఆలస్యం అవుతున్నది. కేంద్రం ఆధ్వర్యంలోని పీఎంఏవై ప్రకారం ఇండ్లు ఇస్తే.. దాదాపు రూ.4 వేల కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నది. 

కాగా, పకడ్బందీగా ఈ స్కీమ్​ను అమలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక యాప్​ను రూపొందించింది. ఇందులోనే లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణ దశలు, ఫేజ్​ల వారీగా నిధుల విడుదల వంటివన్నీ అప్​డేట్​ చేయనున్నారు. పైలెట్​ ప్రాజెక్ట్​ కింద  మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక, ఈ యాప్​ పనితీరును పరిశీలిస్తున్నారు.ఈ వివరాలన్నింటినీ ఉన్నతాధికారులు సీఎం రేవంత్​ రెడ్డికి వివరించినట్టు తెలిసింది. డిసెంబర్​మొదటివారంలోనే ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించి.. ముగ్గు పోసేలా చూడాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం అన్నట్టు సమాచారం. శనివారం జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి  ఇందిరమ్మ ఇండ్ల విధివిధానాలపై రేవంత్​రెడ్డి సమీక్షించారు.

ALSO READ | కన్నవాళ్లను గెంటేస్తున్నరు .. వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు

ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌‌‌‌ల‌‌‌‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌‌‌‌ని సూచించారు.  దివ్యాంగులు, వ్యవ‌‌‌‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాల‌‌‌‌ని  తెలిపారు. తొలి ద‌‌‌‌శ‌‌‌‌లో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున త‌‌‌‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌‌‌‌ని, ఈ విష‌‌‌‌యంలో గ్రామ కార్యద‌‌‌‌ర్శితోపాటు మండ‌‌‌‌లస్థాయి అధికారుల‌‌‌‌ను బాధ్యుల‌‌‌‌ను చేయ‌‌‌‌డంతోపాటు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన సాంకేతిక‌‌‌‌త‌‌‌‌ను వినియోగించుకోవాల‌‌‌‌ని అధికారుల‌‌‌‌ను ఆదేశించారు. ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల మొబైల్ యాప్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌‌‌‌ని, ఏ ద‌‌‌‌శ‌‌‌‌లోనూ ల‌‌‌‌బ్ధిదారుకు ఇబ్బంది క‌‌‌‌ల‌‌‌‌గ‌‌‌‌వ‌‌‌‌ద్దని, అదే స‌‌‌‌మ‌‌‌‌యంలో శాఖాప‌‌‌‌రంగా ఎలాంటి పొర‌‌‌‌పాట్లకు తావివ్వకుండా చూడాల‌‌‌‌ని ఆదేశించారు.

ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల ప‌‌‌‌రిధిలో ఇందిర‌‌‌‌మ్మ ఇండ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చ‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌ని సీఎం సూచించారు. ల‌‌‌‌బ్ధిదారులు ఆస‌‌‌‌క్తి చూపితే ఇందిర‌‌‌‌మ్మ ఇండ్లకు అద‌‌‌‌నంగా గ‌‌‌‌దులు నిర్మించుకునేందుకు  అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాల‌‌‌‌ని  అధికారుల‌‌‌‌కు స్పష్టం చేశారు. ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల స్కీమ్​ స‌‌‌‌మ‌‌‌‌ర్థవంతంగా కొన‌‌‌‌సాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బ‌‌‌‌లోపేతం కావాల‌‌‌‌ని, ఇందుకు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన అధికారులు, సిబ్బందిని నియ‌‌‌‌మించుకోవాల‌‌‌‌ని శాఖ ఉన్నతాధికారుల‌‌‌‌కు సీఎం సూచించారు.  ఈ సమీక్షలో  సీఎం స‌‌‌‌ల‌‌‌‌హాదారు వేం న‌‌‌‌రేంద‌‌‌‌ర్ రెడ్డి, సీఎంవో సెక్రటరీ చంద్రశేఖ‌‌‌‌ర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యద‌‌‌‌ర్శి  జ్యోతి బుద్ధప్రకాశ్​, ప్రత్యేక కార్యద‌‌‌‌ర్శి వి.పి.గౌత‌‌‌‌మ్  పాల్గొన్నారు. 

ఎంపీడీవో కార్యాలయాల్లో మోడల్  ఇండ్లు

రాష్ట్రవ్యాప్తంగా సొంత భవనాలు ఉన్న ఎంపీడీవో కార్యాలయల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. రాష్ట్రంలో సుమారు 640 మండలాలు ఉండగా.. 500 మండలాల్లో ప్రభుత్వ జాగా లో ఎంపీడీవో కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో రూ.5 లక్షల వ్యయంతో 150 గజాల్లో ఇండ్లు నిర్మించనున్నారు. అనంతరం వాటిని  ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించనున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వినియోగించనున్నారు.  ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ తోపాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల కు ఇండ్లపై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.