సింధు టైటిల్‌ సాధించేనా?

సింధు టైటిల్‌ సాధించేనా?
  • నేటి నుంచి ఇండోనేసియా మాస్టర్స్‌‌‌‌
  • గాయాలతో సైనా, సమీర్‌‌ వర్మ దూరం

బాలి: టోక్యో ఒలింపిక్స్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌ నెగ్గిన తర్వాత ఆడిన రెండు టోర్నమెంట్లలో నిరాశ పరిచిన ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు మరో సవాల్‌‌కు రెడీ అయింది. మంగళవారం మొదలయ్యే ఇండోనేసియా మాస్టర్స్‌‌ సూపర్‌‌ 750 టోర్నమెంట్‌‌లో  ఎలాగైన టైటిల్‌‌ నెగ్గి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. గాయాల కారణంగా సీనియర్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌తో పాటు సమీర్‌‌ వర్మ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో, ఇండియా నుంచి సింధుపైనే అంచనాలు ఉన్నాయి.  రెండేళ్ల కిందట ఈ టోర్నీలో రన్నరప్‌‌గా నిలిచిన ఆమె ఈ సారి థర్డ్‌‌ సీడ్‌‌గా బరిలోకి దిగుతోంది. విమెన్స్‌‌ సింగిల్స్‌‌  ఫస్ట్‌‌ రౌండ్‌‌లో థాయ్‌‌లాండ్‌‌కు చెందిన సుపనిడాను ఎదుర్కోనుంది. క్వార్టర్స్​ దాటితే సెమీస్‌‌లో టాప్‌‌ సీడ్‌‌ జపాన్‌‌ షట్లర్‌‌ అకానె యమగూచితో సింధుకు అసలైన సవాల్‌‌ ఎదురయ్యే చాన్సుంది. ఇక, మెన్స్‌‌ సింగిల్స్‌‌లో సీనియర్‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌, యంగ్‌‌స్టర్‌‌ లక్ష్యసేన్‌‌పై అందరి దృష్టి ఉంది. సాయి ప్రణీత్‌‌,హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌, కశ్యప్‌‌ కూడా బరిలో నిలిచారు. మెన్స్‌‌ డబుల్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌, అర్జున్‌‌–ధ్రువ్‌‌ జంటలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. విమెన్స్‌‌ డబుల్స్‌‌లో సిక్కిరెడ్డి–అశ్విని, మిక్స్‌‌డ్‌‌లో అశ్విని–సుమీత్‌‌ రెడ్డి, సిక్కి–ధ్రువ్​ జంటలు బరిలో ఉన్నాయి.