ప్రధానిపై ప్రజలకు కోపం లేదు..బీజేపీకి 300 సీట్లు: ప్రశాంత్ కిషోర్

ప్రధానిపై ప్రజలకు కోపం లేదు..బీజేపీకి 300 సీట్లు: ప్రశాంత్ కిషోర్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 300 సీట్లు వస్తాయన్నారు రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్..ప్రజల్లో ప్రధాని మోదీప పెద్దగా వ్యతిరేకతలేదని అన్నారు. బీజేపీకి సొంతంగా 370 సీట్లు రావడం అసాధ్యమని ఆ పార్టీకి దాదాపు 300 సీట్లు వస్తాయని అన్నారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

బీజేపీకి 370 సీట్లు వస్తాయని..ఎన్డీఏ 400 మార్కును అధిగమిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి ఇది సాధ్యం కాదని నేను చెప్పాను.. కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచేందుకు మోదీ అలా చెబుతున్నారు. బీజేపీకి 370 సీట్లు రావడం అసాధ్యం. అయితే ఆ పార్టీ 270 మార్కు కంటే దిగువకు పడిపోదని కూడా నేను నమ్ముతున్నాను అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయనడానికి కారణాలు వివరించారు ప్రశాంత్ కిషోర్. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అధికార పార్టీకి పెద్దగా ఢోకా లేదని..దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో అంతగా పార్టీకి తక్కువ పట్టుందని.. అయితే కొన్ని స్థానాలు పెరుగొచ్చని అన్నారు. 

అంతేకాకుండా దేశంలో ప్రధాని మోడీపై వ్యతిరేకత లేదని.. సమాజంలో ఒక వర్గాన్ని మినహాయి ప్రజల్లో మోదీపై వ్యతిరేకత లేదని అన్నారు.