ఓ పెళ్లి వేడుకలో ఎవరు ఊహించని వింత ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు పొరపాటున సిందూరం(కుంకుమ) తీసుకురావడం మర్చిపోయాడు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక కంగారుపడుతుంటే.. పెళ్ళికి వచ్చిన ఓ గెస్ట్ బ్లింకిట్ యాప్ లో ఆర్డర్ చేయండి అంటూ సలహా ఇచ్చాడు.. దింతో బ్లింకిట్ ఆ పెళ్లిని కాపాడింది.
ఎం జరిగిందంటే... హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో వధువుకు వరుడు సిందూరం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. సరిగ్గా ఆ సమయానికి సిందూరం అక్కడ కనిపించలేదు. ఇక పెళ్లి ఆగిపోతుందేమో అని అందరూ కంగారు పడుతున్న సమయంలో ఎవరో తెలివిగా ఆన్‌లైన్‌లో బ్లింకిట్ ద్వారా సిందూరాన్ని ఆర్డర్ చేశారు.
కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ బాయ్ పెళ్లి మండపానికి వచ్చి సిందూరాన్ని డెలివరీ ఇచ్చాడు. దీంతో పెళ్లి వేడుక సజావుగా సాగింది. ఆ జంట చివరికి హమ్మయ్య అనుకోని నవ్వుతు పెళ్లి చేసుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
"ఏక్ చుట్కీ సిందూర్ కీ కీమత్..": షారుఖ్ ఖాన్ డైలాగ్ గుర్తు చేస్తూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా కూరగాయలు, వంట సమన్లు డెలివరీ చేసే యాప్స్.. ఇప్పుడు ఏకంగా పెళ్లిని కూడా కాపాడుతున్నాయి.. బ్లింకిట్ సూపర్ అని కొందరు ప్రశంసిస్తున్నారు.
గుజరాత్‌లో మా తమ్ముడి పెళ్లిలో కూడా సేమ్ ఇలాంటి సంఘటనే జరిగింది అని ఒక యూజర్ అన్నారు. మొత్తానికి ఈ జంటకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక తీపి గుర్తుగా పెళ్లి మిగిలిపోయింది.
