KKR vs SRH: హెడ్, అభిషేక్ శర్మ ఔట్.. కష్టాల్లో సన్‍రైజర్స్

KKR vs SRH: హెడ్, అభిషేక్ శర్మ ఔట్.. కష్టాల్లో సన్‍రైజర్స్

అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‍రైడర్స్‌తో జరుగుతోన్న క్వాలిఫయర్-1లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. కోల్‌కతా పేసర్లు మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా విజృంభించడంతో సన్‍రైజర్స్ 13 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ట్రావిస్‌ హెడ్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా.. అభిషేక్ శర్మ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‍రైజర్స్‌ను మిచెల్ స్టార్క్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. రెండో బంతికి పరుగుల ఖాతా తెరవకుండానే ట్రావిస్‌ హెడ్ (0) బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (3)ను వైభవ్‌ అరోరా ఔట్ చేశాడు. దీంతో సన్‍రైజర్స్ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం స్కోర్.. మూడు ఓవర్లు ముగిసేసరికి 21/2. నితీశ్ రెడ్డి (1), రాహుల్ త్రిపాఠి (15) క్రీజులో ఉన్నారు.