ట్రైన్‌ AC కోచ్‌లో కుక్కకు స్పెషల్ బెర్త్..దానికి సెల్యూట్ కొడుతున్న జనం..ఎందుకంటే..

ట్రైన్‌ AC కోచ్‌లో కుక్కకు స్పెషల్ బెర్త్..దానికి సెల్యూట్ కొడుతున్న జనం..ఎందుకంటే..

కుక్కలు విశ్వాసానికి మారుపేరు..తనను పెంచుకున్న యజమానికి బతికున్నంత కాలం నమ్మకంగా ఉంటుంది.అయితే కొన్న కుక్కలు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా పనిచేస్తాయని చాలా మందికి తక్కువగా తెలుసు. పోలీస్ డిపార్టుమెంట్లతో పనిచేస్తున్న డాగ్స్ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. భారత సైన్యం లో కూడా వీర జవాన్లతోపాటు మన ఆర్మీ డాగ్స్ ప్రత్యేక పాత్ర పోషిస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే వాటికి మనుషుల్లాగే రిటైర్ మెంట్లు ఉంటుంది. తాజాగా మీరట్ లోని RVC సెంటర్ లోని ఇండియన్ ఆర్మీ డాగ్ గా పనిచేసి రిటైర్ అయిన 9ఏళ్ల ట్రాకర్ డాగ్.. రైల్లో ప్రత్యేకంగా ఏసీ కోచ్ డాగ్స్ రిటైర్ మెంట్ హోమ్ కు ప్రయాణించింది. 

ఇండియన్ ఆర్మీకి చెందిన ఈ కుక్క పేలుడు పదార్థాలను కనుగొనడం నుండి శత్రువులపై నిఘా ఉంచడం వరకు అనేక ఆపరేషన్లలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అలాంటి ఈ డాగ్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసినప్పుడు సాధారణంగా వారి నిర్వాహకులచే దత్తత తీసుకుంటారు. కొన్నింటిని ప్రత్యేక రిటైర్డ్ హోం కి తీసుకెళతారు. 

మీరట్‌లోని పదవీ విరమణ ఇంటికి చేరుకోవాల్సిన ఈ ఇండియన్ ఆర్మీ డాగ్ చివరి డ్యూటీ తర్వాత .. అది రైల్లో  ప్రత్యేక ఏసీ కోచ్ లో ప్రయాణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఆర్మీడాగ్ నెటిజన్ల హార్ట్ ను కొల్లగొట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఓ మంచి నిర్ణయం వల్ల ఆర్మీడాగ్ కు ఈ గౌరవం దక్కింది. రిటైర్డ్ కుక్కలు తమ హ్యాండ్లర్లతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు రక్షణ శాఖ వీలు కల్పిస్తుంది. 

ఏనీ వే..వీర జవాన్లతో ఆర్మీలో పనిచేసి విజయవంతంగా డ్యూటీ నిర్వహించి రిటైర్ మెంట్ తీసుకున్న ఈ శునకాన్ని అభినందించక ఉండలేం కాదా.. ఈ ఆర్మీ డాగ్ కి పదవీ విమరణ శుభాకాంక్షలు చెప్పకుండా ఉండలేం.