జనగామ అర్బన్, వెలుగు: యూరియా బుకింగ్యాప్ వినియోగంపై ప్రతీ మండలంలో మండల స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన గూగుల్ మీట్ లో మాట్లాడారు. సమావేశాలకు తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఏవో తప్పనిసరిగా హాజరై సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతీ యూరియా విక్రయ కేంద్రానికి ఒక డీఏవోను ట్యాగ్ చేయాలని, యాప్ ప్రారంభ దశలో వచ్చే సమస్యలు, సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు ఈజీఎస్ చెల్లింపుల కోసం మంజూరు పొందా లన్నారు. మస్టర్లు రూపొందించి 90 రోజులకు గానూ ఈజీఎస్ చెల్లింపులను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని చెప్పారు. లబ్ధిదారులకు వెంటనే ఇసుక కూపన్లు జారీ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీవో గోపిరామ్, డీఏవో అంబికా సోని తదితరులు పాల్గొన్నారు.
