పవర్ ప్రాజెక్ట్ వర్కర్లకు టెర్రర్ లింకులు.. జమ్మూకాశ్మీర్ పోలీసుల లేఖ

పవర్ ప్రాజెక్ట్ వర్కర్లకు టెర్రర్ లింకులు.. జమ్మూకాశ్మీర్ పోలీసుల లేఖ
  •  ప్లాంట్ జనరల్ మేనేజర్​కు జమ్మూకాశ్మీర్ పోలీసుల లేఖ 

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో పని చేస్తున్న 29 మంది వర్కర్లకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కార్మికులు జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. ఈ మేరకు పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ కు నవంబర్ 1న పోలీసులు లేఖ రాశారు. ద్రబ్‌‌ షల్లాలోని చీనాబ్ నదిపై 850 మెగావాట్ల సామర్థ్యంతో రాటిల్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌‌ విద్యుత్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు.

 ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న 29 మంది వర్కర్లకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు లేఖ రాశారు. 25 మంది వర్కర్లపై కిష్త్వార్ పోలీస్ స్టేషన్​లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. మరో ఇద్దరి కార్మికులకు చెందిన తండ్రి ఓవర్ గ్రౌండ్ వర్కర్​గా పని చేస్తున్నారని వివరించారు. ఆయన టెర్రరిస్టులకు లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తున్నారని చెప్పారు. ఇతర ఉద్యోగులకూ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిపారు. 

వ్యూహాత్మక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ విద్యుత్ ప్రాజెక్టు శత్రు దేశాలకు లక్ష్యంగా మారిందన్నారు. టెర్రరిస్టులతో సంబంధాలు, నేరచరిత్ర ఉన్న వారిని పనిలో పెట్టుకోవడం వల్ల విద్యుత్ ప్రాజెక్టు భద్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.