అమ్రాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ డీఎఫ్వోగా రేవంత్ చంద్ర శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 2022 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన రేవంత్ చంద్ర ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎఫ్డీవో గా పని చేశారు. పదోన్నతిపై అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డీఎఫ్వోగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అటవీ భూముల ఆక్రమణలు, వేటగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అచ్చంపేట, అమ్రాబాద్ ఎఫ్డీవోలు రామ్మూర్తి, చంద్రశేఖర్, ఎఫ్ఆర్వోలు సుబూర్, వీరేశ్, ముక్దూం, దేవరాజు, గురుప్రసాద్, రవికాంత్, బాపురెడ్డి, మల్లికార్జున్ పాల్గొన్నారు.
