ఇంద్రాణి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు : మంచు విష్ణు

ఇంద్రాణి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు : మంచు విష్ణు

ప్రస్తుతం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రాల‌కు మంచి డిమాండ్ ఉంటోంది. అలాంటి ఒక వినూత్న టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ‘ఇంద్రాణి’ మూవీ తెరకెక్కుతోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ, కన్నడ, మ‌ల‌యాళ భాషల్లో రూపొందిన ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోలకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌ను ప్రముఖ హీరో మంచు విష్ణు విడుద‌ల చేశారు. ‘ఇంద్రాణి’ లాంటి ఒక కొత్త త‌రం మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్ర యూనిట్‌కు ఆయన అభినంద‌న‌లు తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్ వర్క్ అత్యుత్తమ నాణ్యతతో ఉండి చక్కగా కొరియోగ్రఫీ చేశారని మంచు విష్ణు మెచ్చుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్లు నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయన్నారు.

నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘ఇంద్రాణి భుజంపై ఉన్న రోబో చాలా బాగుంది. పిల్లలను, పెద్దలను త‌ప్పకుండా ఆకట్టుకుంటుంది’ అన్నారు.

చిత్ర దర్శకుడు స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ.. మూడు ఎలిగేటర్ల తో ఇంద్రాణి చేసే ఫైట్స్, షతాఫ్ ఫిగర్ తో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు. తక్కువ సమయంలోనే సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించడానికి ఎంత‌గానో శ్రమిస్తున్న వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీకాంత్ కందాల బృందానికి ఆయన కృత‌జ్ఞతలు తెలిపారు. 

టైటిల్ రోల్ పోషిస్తున్న యానీ భ‌రద్వాజ్ పర్వతారోహకురాలు. క‌బీర్ దుహ‌న్ సింగ్, ప్రణీత  జిజిన‌, గ‌రిమ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు.