చొరబాటు దారులకు ఓటు హక్కు కల్పించి కాపాడుతున్నారు

చొరబాటు దారులకు ఓటు హక్కు కల్పించి కాపాడుతున్నారు

శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది –కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

హైదరాబాద్: బంగ్లాదేశ్ నుండి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలకు హైదరాబాద్ లో ఆశ్రయం కల్పించారి.. వారికి ఓటు హక్కు కూడా కల్పించి కాపాడుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పుటు కోసం ఎందరో ప్రాణ త్యాగం చేస్తే.. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో జోడీ కట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఎంఐఎం-టీఆర్ఎస్ అవినీతి కూటమికి గ్రేటర్ ఎన్నికల్లో  ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ కూడా వేసిందని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ లో ఓటమి భయం స్పష్టంగా కనపడుతోందని ఆమె పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ చొరబాటు దారులకు హైదరాబాద్ లో ఓటు హక్కు కల్పించి కాపాడుతున్న విషయం జాతీయ మీడియాతోపాటు.. లోకల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వచ్చాయని.. ఆడియో టేపులు సైతం టీవీల్లో ప్రసారమయ్యాయి.. ఎంఐఎం లెటర్ హెడ్లు కూడా బయటపడ్డాయి.. అయినా రాష్ట్ర  ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోలేదన్నారు. చొరబాటు దారుల విషయంపై కేసీఆర్ పెదవి విప్పడం లేదని..  ఈ  విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. అక్రమ వలసదారులపైనే టీఆర్ఎస్ ఆధారపడిందని ఆమె ఆరోపించారు. చొరబాటుదారుల విషయంలో బీజేపీ వైఖరి స్పష్టం చేసిందన్నారు. హైదరాబాద్ లో 75 వేలకుపైగా అక్రమ చొరబాటుదారులు వచ్చారు..  తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.224 కోట్లు ఇచ్చినా కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు.

 వరద నష్టంపై ఇప్పటి వరకు కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదు

తెలంగాణ ప్రభుత్వం వరద నష్టంపై ఇప్పటి వరకు  కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదని కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీ విమర్శించారు.  75వేల రోహింగ్యా కుటుంబాలకు హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయని.. లెటర్ హెడ్స్ తో ఎంఐఎం నాయకులు రోహింగ్యా ముస్లింలను కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు. పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసి ఉంటే.. కరోనా సోకిన పేదలకు లబ్ధి చేకూరేదన్నారు. పారదర్శకమైన  పాలన అందించటమే బీజేపీ లక్ష్యం అన్నారు. అక్రమ వలసదారుల ఓటు హక్కును తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు టెక్స్ టైక్స్ పార్క్ ను కేంద్రం మంజూరు చేసిందన్నారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథాకాలు  తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం లేదని.. హామీల అమల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీ విమర్శించారు.

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

వ్యాక్సిన్ పంపిణీకి మెకానిజం రెడీ చేయండి