ధరల పెరుగుదలపై శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు

ధరల పెరుగుదలపై శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశంలో ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌ (ధరల పెరుగుదల) ఇప్పటిలో తగ్గదని, ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగుతుందని ఆర్​బీఐ శక్తికాంత దాస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. డిసెంబర్ వరకు ఆర్‌‌‌‌బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్‌‌ 6 శాతంపైనే  ఇన్‌‌ఫ్లేషన్ కొనసాగుతుందని, ఆ తర్వాత 6 శాతం కిందకు దిగిరావొచ్చని చెప్పారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పాటు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో  సప్లయ్ చెయిన్ నష్టపోవడంతో దాస్ ఈ అంచనాలు వేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరం నాటి జీడీపీ నెంబర్లను క్రాస్ చేశామని, చాలా ఎకానమీ ఇండికేటర్లు మెరుగ్గా రికార్డవుతున్నాయని పేర్కొన్నారు. దేశ ఎకానమీ నిలకడగా రికవరీ అవుతోందని చెప్పారు. యూకే, యూఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యల వలన రూపాయి విలువ తగ్గుతోందని దాస్ పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌‌మెంట్ అవకాశాల గురించి మాట్లాడుతూ ఫార్మా, టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.