బీసీలకు మరోసారి అన్యాయం: ఆర్.కృష్ణయ్య

బీసీలకు మరోసారి అన్యాయం: ఆర్.కృష్ణయ్య

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో బీసీలకు మరోసారి అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించకపోవడం సరికాదన్నారు. 

శుక్రవారం హైదరాబాద్​లోని విద్యానగర్ బీసీ భవన్​లో వివిధ బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇవ్వలేదని ఫైర్​అయ్యారు. కొత్త స్కీంలు లేవని, కొనసాగుతున్న స్కీంలకు బడ్జెట్ పెంచలేదన్నారు.