
గుంతల రోడ్లను బాగు చేయాలని ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టాడు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే హెల్మెట్ ఒక్కటి పెట్టుకుంటే చాలదు..రోడ్లు కూడా బాగుండాలని ట్యాగ్ లైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. గుంతలు ఉన్న రోడ్డు కనిపిస్తేచాలు.. ఆ గుంతలో కూర్చుని పద్మాసనం వేస్తూ వినూత్నంగా నిరసన తెలుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బస్సు ఛార్జీలు, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ ధరించాలని చెప్పే ప్రభుత్వం.. రోడ్లను మాత్రం బాగు చేయదని అతడికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే నిరసన చేస్తున్న వ్యక్తి ఫేస్ కనిపించకుండా హెల్మెట్ పెట్టుకున్నాడు. అతడి పేరు వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుధ్ధి చెప్పేలా వెరైటీ పద్మాసనం నిరసన సూపర్భ్ అంటున్నారు.