భారత నావికాదళంలోకి INSవేలా జలాంతర్గామి

భారత నావికాదళంలోకి INSవేలా జలాంతర్గామి

దేశం సముద్ర రక్షణలో నేవీ సామర్థ్యం మరింత పెరిగిందన్నారు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ . ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో INS వేలా జలాంతర్గామిని ఇవాళ(గురువారం) భారత నావికాదళంలోకిప్రవేశ పెట్టారు. ప్రాజెక్టు 75 చేపట్టడంతో ఫ్రాన్స్-భారతదేశం మధ్య వ్యూహాత్మక సారూప్యత పెరుగుతుందన్నారు కరంబీర్ సింగ్. ఈ జలాంతర్గామిని ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ కు చెందిన MS నావల్ గ్రూప్ తో కలిసి నిర్మించింది.  గతంలో తయారు చేసిన కల్వరి,ఖండేరి, కరంజ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు. INS అవతార్ 1973 ఆగస్టు 31వ తేదీన ప్రారంభించిన తర్వాత 37ఏళ్లు సేవలందించిందని చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు. INS వేలా జలాంతర్గామి అత్యంతశక్తివంతమైనదని ఆయన తెలిపారు. ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక పలు క్షిపణులు,రాకెట్లతో నిండి ఉందన్నారు కరంబీర్ సింగ్.