ఇన్స్టాగ్రామ్ సేవలు డౌన్..ట్విట్టర్లో యూజర్స్ రచ్చ

ఇన్స్టాగ్రామ్ సేవలు డౌన్..ట్విట్టర్లో యూజర్స్ రచ్చ

ఇన్స్టాగ్రామ్ సేవలు డౌన్ అయ్యాయి. డీఎంతోపాటు ఇతర ఫీచర్స్ పనిచేయలేదు.  ఒక్కసారిగా యాప్ పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.  గురువారం రాత్రి 10గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డౌన్ డిటెక్టర్ ప్రకారం 66 శాతం యాప్ క్రాష్, 24శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలు, 10శాతం మంది యాప్ లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారు. కొందరు స్టోరీలు ఓపెన్ చేయలేకపోయారు..ఇంకొందరు మెస్సేజులు పంపలేకపోయారు. 

#instagramdownagain అనే హ్యాష్ ట్యాగ్ ట్వీటర్ లో ట్రెండ్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన సంస్థ సమస్యను పరిష్కరించింది. సేవల్లో అంతరాయం కలిగినందుకు క్షమించమని కోరింది. ఇన్స్టా సేవలు నిలిచిపోవడంపై ట్విట్టర్ లో రకరకాల మీమ్స్ సందడి చేశాయి.