ఇంటర్‌‌‌‌ అడ్మిషన్ల గడువు సెప్టెంబర్ 7 వరకు పొడిగింపు

ఇంటర్‌‌‌‌ అడ్మిషన్ల గడువు సెప్టెంబర్ 7 వరకు పొడిగింపు

దరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేట్‌‌‌‌ జూనియర్‌‌‌‌ కాలేజీల్లో ఇంటర్​ఫస్టియర్ అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ ఏడో తేదీ వరకు పొడిగించారు. కాలేజీల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు మేనేజ్‌‌‌‌మెంట్ల కోరిక మేరకు పెంచామని, ఇదే చివరి చాన్స్ అని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రిన్సిపాల్స్‌‌‌‌ను ఆదేశించారు. అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని, కేవలం టెన్త్ జీపీఏ, మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు కేటాయించాలని సూచించారు. 

ఓపెన్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టెన్త్, ఇంటర్‌‌‌‌ అడ్మిషన్లకు..

తెలంగాణ ఓపెన్‌‌‌‌ స్కూల్‌‌‌‌ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్​కోర్సుల ప్రవేశాల గడువును పొడిగిస్తూ డైరెక్టర్ కె. లింగయ్య ఉత్తర్వులు జారీ చేశారు. 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తులు సమర్పించడానికి సెప్టెంబర్‌‌‌‌ 15 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత కలిగి ఉండి ఇంతవరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.