V6 News

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు ..ఏప్రిల్ 23 వరకు పెంపు

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు ..ఏప్రిల్ 23 వరకు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేనెలలో జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ స్టూడెంట్లతో పాటు ఫెయిలైనవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.