సూర్యాపేటలో శిశువులను అమ్ముతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్

సూర్యాపేటలో  శిశువులను అమ్ముతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్

ఇతర రాష్ట్రాల నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాలో విక్రయిస్తున్న ముఠాను  సూర్యపేట టౌన్ పోలీసులు  అరెస్ట్ చేశారు.  సంతానం లేని దంపతులే టార్గెట్ గా ఈ దందా సాగిస్తోంది ముఠా.. ఒక్కో శిశువు ను లక్షల్లో అమ్ముతోంది ముఠా.  ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 28 మంది చిన్నారులను అమ్మినట్టు పోలీసులు నిర్ధారించారు.  10 మంది చిన్నారులను గుర్తించి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. సూర్యాపేట టౌన్ పోలీసుల అదుపులో 18 మంది ముఠా సభ్యులు ఉన్నారు.  ఈ రాకెట్ వెనకాల ఉన్నదెవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్ లో మార్చిలో కూడా  చిన్న పిల్లల విక్రయాల అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పిల్లల అమ్మకాల్లో కీలక నిందితురాలు సోము అమూల్యను అరెస్ట్ చేశారు.ఈ ముఠా నుంచి 10 మంది చిన్నారులను పోలీసులు రెస్క్యూ చేశారు.  కాపాడిన చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, 4 బాలురు ఉన్నారు. ఈ ముఠా మహారాష్ట్ర, యూపీ , ఛతీస్ ఘడ్ లో పిల్లను సేకరించి.. వెస్ట్ బెంగాల్ , తమిళనాడు , కర్ణాటక, ఏపీ, తెలంగాణాలో పిల్లలను అమ్ముతోంది.  ఇప్పటి వరకు 18 మంది చిన్నారులను ఈ ముఠా అమ్మింది. 

►ALSO READ | సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తేస్తాం : ఏసీపీ శ్రీనివాస్