
యాదగిరిగుట్ట, వెలుగు: ఎలాంటి అల్లర్లు, నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తేస్తామని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సీఐ భాస్కర్ తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి గొడవలు, అల్లర్లు సృష్టించకుండా ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిం చాలని సూచించారు. మళ్లీ నేరాలకు పాల్ప డితే మాత్రం పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.