ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

ఆర్టీసీ బస్సు కింద పడి  ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో  దారుణం జరిగింది.  ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి శ్రీజ(16) అనే ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.  జగద్గిరిగుట్ట నుంచి కూకట్ పల్లిలోని ఎస్సార్ శ్రీ గాయత్రీ కాలేజీకి వెళ్లేందుకు  బస్సు ఎక్కుతుండగా కాలుజారి కింద పడడంతో ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి  శ్రీజ అక్కడికక్కడే  మృతి  చెందింది. ఈ ఘటనతో కాసేపు రోడ్ పై ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాలేజ్ కి వెళ్లి తిరిగొస్తుందనుకున్న బిడ్డ ఇక లేదనే వార్తను తట్టుకోలేక విలపిస్తున్నారు. అల్లారుమద్దుగా పెంచుకున్న బిడ్డ తమను విడిచిపోయిందని రోదిస్తున్నారు. 

ALSO READ : కవితపై మల్లన్న కామెంట్లను ఖండిస్తున్నం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

 ఈ మద్య హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్,నిర్లక్ష్యం కారణంగా రోజు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడుస్తున్నారు.