ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్..1.75 లక్షల మంది విద్యార్థులు.. 217 పరీక్షా కేంద్రాలు

ఫిబ్రవరి  25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్..1.75 లక్షల మంది విద్యార్థులు.. 217 పరీక్షా కేంద్రాలు
  •     ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్​
  •     ఏర్పాట్లు పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్​ ఆదేశాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: వ‌‌చ్చే నెల 25 నుంచి  మార్చి 18వ తేదీ వరకు జరగనున్న ఇంటర్​పరీక్షల ఏర్పాట్లపై  సోమ‌‌వారం క‌‌లెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులతో  జిల్లా అడిషనల్​క‌‌లెక్టర్ జితేంద‌‌ర్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ప‌‌రీక్ష స‌‌మ‌‌యానికి 30 నిముషాల ముందే కేంద్రాల‌‌కు  చేరుకోవాల‌‌న్నారు. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు రెండు సెషన్లలో ఉద‌‌యం 9 గంట‌‌ల నుంచి 12 గంట‌‌ల వ‌‌ర‌‌కు, మ‌‌ధ్యాహ్నం 2 గంట‌‌ల నుంచి  సాయంత్రం 5 గంట‌‌ల వ‌‌ర‌‌కు  ప్రార్టీక‌‌ల్స్ జ‌‌రుగుతాయన్నారు. 

 

హైదరాబాద్ జిల్లాలో మొదటి సంవత్సరంలో జనరల్ విభాగానికి సంబంధించి 81,898 మంది, సెకండ్ ఇయర్ లో  93,373  మంది కలిపి 1,75,271  మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు  తెలిపారు.  దీని కోసం 217 పరీక్షా కేంద్రాలు,   ప్రాక్టికల్స్​కోసం 225 కేంద్రాల‌‌ను ఏర్పాటు చేస్తున్నామ‌‌ని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వ‌‌ద్ద 144 సెక్షన్ ఉంటుందని, సెంటర్ల సమీపంలో ఉండే జిరాక్స్ షాపుల‌‌ను మూసి వేయాలన్నారు.  జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న, డీఎస్పీ యాకూబ్ రెడ్డి, స్పెష‌‌ల్ ఆఫీస‌‌ర్ ఆనంద్ కుమార్‌‌, డీఈవో రోహిణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

వికారాబాద్​ జిల్లాలో... 

వికారాబాద్:  వికారాబాద్​ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ విధానంపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ కు వికారాబాద్​ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్.శంకర్ నాయక్ అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా జనరల్ లో 37, ఒకేషనల్ లో 16 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

జనరల్ సెకండియర్​లో 3,614 మంది  సైన్స్ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల్లో ఫస్టియర్​లో 5,116 మంది విద్యార్థులు రీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. జనవరి  21న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు, 22న సెకండియర్ విద్యార్థులకు, 23నఎథిక్స్ అండక హ్యూమన్ వాల్యూస్, 24న ఎన్విరాన్​మెంటల్​ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.