సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ

పంజాబ్ లో ఖేతి బచావో పేరుతో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తుంది. పలు జిల్లాలు, నియోజవర్గాల్లో 50 కిలోమీటర్ల మేర ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ర్యాలీకి మంత్రులు, మరియు రైతుల మద్దతు లభించడంతో పాటు రాహుల్ తన ర్యాలీలో ట్రాక్టర్ పై సోఫా వేయించి అందులో కూర్చొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో  ట్రోల్ అవుతున్నాయి.

This image has an empty alt attribute; its file name is Mr-Bean-Rahul-Gandhi.jpg

ముఖ్యంగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ పై ఉన్న సోఫా సెట్ లో కూర్చొవడం కొంచెం వింతగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మిస్టర్ బీన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ కారెక్టర్‌ని పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా బాగా ఇష్టపడుతారు. ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు చాలా మంది ఇతడి షోలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. మాటలు లేకుండా ఓ చిన్న బొమ్మను పట్టుకొని, సపరేట్‌గా తయారు చేసిన కారుతో ఆ పాత్రలో రోవన్ అట్కిన్‌సన్‌ చేసే అల్లరి ఏ వర్గం వారినైనా తెగ ఆకట్టుకుంటుంది.

ఇప్పుడు ఇదే తరహాలో రాహుల్ సపరేట్ గా డిజైన్ చేయించుకున్న ట్రాక్టర్ పై సోఫాలో కూర్చున్న ఫోటోల్ని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. రాహుల్ మంచి నటుడు అంటు కితాబ్ ఇస్తున్నారు.