కంపెనీలో కొత్ల నియామకాలు కరోనా ముందటి స్థాయిలకు రావాలంటే ఇంకా మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని చాలా మంది రిక్రూటర్లు చెప్పారు. జాబ్ పోర్టల్ నౌకరి డాట్ కామ్ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడించారు. అయితే కేవలం 15 శాతం మంది మాతమే ఇంకా ఏడాది సమయం పడుతుందని అభిపాయపడ్డారు. నౌకరి చేపట్టిన ఈ సర్వేలో 1600 మంది హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్ మెంట్ హెడ్ లుగా పాల్గొన్నారు. కేవలం 15 శాతం మంది రిక్రూటర్లు ,హెచ్ ఆర్ హెడ్ లు మాత్రమే లేఆఫ్స్ ప్రకటించినట్లు అంగీకరించారు. మూడో వంతు మంది హెడ్ లు ఎలాంటి లే ఆఫ్స్ ఉండవని భరోసా ఇచారు. హెచ్ఆర్ హెడ్స్ తో పాటు ఉద్యోగం కావాలనుకునే వారి సెంటిమెంట్ ఎలా ఉందనే విషయంపై కూడా నౌకరి సర్వే చేసింది. దీనిలో 50 వేల మందికి పైగా జాబ్ సీకర్స్ పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది లే ఆఫ్స్ నిజమేనన్నారు. గత రెండు నెలల నుంచి చాలా కంపెనీలు ముఖ్యంగా స్టార్టప్ లు వేల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల వచ్చిన నష్టాలను భరించలేక ఉద్యోగులను తీసేశాయి కంపెనీలు. నౌకరి సర్వే ప్రకారం, ప్రతి 5 మంది హెచ్ ఆర్ హెడ్స్ లో కేవలం ఒకరికి మాతమే జీతాల కోత ఉందని వెల్లడించారు. ఉద్యోగులకు, కంపెనీలకు మద్య ఎప్పటికప్పుడు సంప్రదింపులు ఉండాలని, వీరి మధ్య పారదర్శకత ఉండేలా చూసు కోవాలని నౌకరి సర్వే పేర్కొంది. లాక్ డౌన్ తర్వాత కొత్త ఉద్యోగాల ఆఫర్లు ఉంటాయని 42 శాతం మంది హెచ్ ఆర్ హెడ్స్, రిక్రూటర్స్ తెలిపారు. ఇది జాబ్ సీకర్స్ కు గుడ్ న్యూస్ అని నౌకరి రిపోర్ట్ పేర్కొంది. కేవలం 6 శాతం మంది మాతమే ఉద్యోగ ఆఫర్లను విత్ డ్రా చేసుకున్నారని తెలిసింది. ఇప్పటికే జాబ్ ఆఫర్లు ఉన్న వారికి కరోనా వల్ల జాయినింగ్ డేట్లు వాయిదా పడే అవకాశం ఉందని నౌకరి సర్వేలో తేలింది.
హైరింగ్ లో దెబ్బతిన్న ఏవియేషన్, హాస్పిటాలిటీ
చాలా ఆర్గనైజేషన్లు హైరింగ్ ను ప్రస్తుతం వాయిదా వేశారు. హైరింగ్ యాక్టివిటీ వాయిదా పడటంతో కంపెనీలు పసుత్తం ఉన్న వర్క్ ఫోర్స్ తోనే వర్క్ ను మేనేజ్ చేస్తున్నాయి. మొత్తంగా మూడింట ఒకవంతు హెచ్ ఆర్ హెడ్స్ హైరింగ్ ను పూర్తిగా ఆపేసనట్లు చెప్పారు.. కేవలం 10 శాతం మంది మాత్రమే హైరింగ్ చేపడుతునట్టు చెప్పారు. హాస్పిటాలిటీ, ఏవియేషన్ , బీఎఫ్ ఎస్ఐ, కన్ స్ట్రక్షన్, స్టాఫింగ్ వంటి రంగాలలో హైరింగ్ బాగా దెబ్బతింది. ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ పై ఈ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది.

