అదానీ ఎనర్జీ చేతికి ఇంటెల్లి స్మార్ట్.. డీల్ విలువ రూ.3,050 కోట్లు

అదానీ ఎనర్జీ చేతికి ఇంటెల్లి స్మార్ట్.. డీల్ విలువ రూ.3,050 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) స్మార్ట్ మీటర్ల సంస్థ ఇంటెల్లి స్మార్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాలో వంద శాతం ఈక్విటీ వాటాను కొనడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీ విలువ రూ. 3,050 కోట్లు. ఇంటెల్లి.. నేషనల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐఎఫ్), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) భాగస్వామ్య సంస్థ. 

ఈ కొనుగోలు ద్వారా 4.70 కోట్ల పైగా స్మార్ట్ మీటర్లతో భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ మీటరింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అదానీ ఎనర్జీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోనుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, అస్సాం రాష్ట్రాలలో ఇంటెల్లి స్మార్ట్ సంస్థకు రెండు కోట్ల ఇరవై లక్షలకు పైగా మీటర్ల పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో ఉంది.