గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు.. 14.32 కిలోల గంజాయి సీజ్

గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు.. 14.32 కిలోల గంజాయి సీజ్

పద్మారావునగర్, వెలుగు: అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు రట్టు చేశాయి. ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా పుణెకు గంజాయి తరలిస్తున్న బిహార్​కు చెందిన జవహర్ కుమార్ (32)ను సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 7.16 లక్షల విలువైన 14.32 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశాలో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న జవహర్​కు.. అఖిలేశ్ కుమార్ అనే స్మగ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జవహర్​కు గంజాయి పార్శిల్ చేరవేస్తే ట్రిప్పుకు రూ.7 వేలు ఇస్తానని అఖిలేష్ ఆశ చూపాడు. దీంతో అక్రమ రవాణాకు అంగీకరించిన జవహర్.. విశాఖ ఎక్స్​ప్రెస్​లో గంజాయి సూట్​కేస్​తో సికింద్రాబాద్ చేరుకున్నాడు. సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడి సూట్​కేస్ తెరిచి చూడగా భారీగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.