ఇన్వెస్టర్లకు రూ.5.64 లక్షల కోట్ల లాస్.. మూడో రోజూ కుంగిన సెన్సెక్స్

ఇన్వెస్టర్లకు రూ.5.64 లక్షల కోట్ల లాస్.. మూడో రోజూ  కుంగిన సెన్సెక్స్

ముంబై: వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు పడ్డాయి. బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ స్టాక్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ మంగళవారం ఒకశాతం పతనమయ్యాయి, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్,  ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూ-చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల షేర్లలో ప్రాఫిట్​బుకింగ్​ఇండెక్స్​లను కిందకు లాగింది.  దీంతో సెన్సెక్స్ 872.98 పాయింట్లు పతనమై 81,186.44 వద్ద స్థిరపడింది. ఇందులోని 27 షేర్లు నష్టాలతో, మూడు లాభాలతో ముగిశాయి.

ఇంట్రాడేలో ఆటో, ఫైనాన్షియల్,  డిఫెన్స్ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ప్రాఫిట్​బుకింగ్​వల్ల 905.72 పాయింట్లు పడిపోయి 81,153.70కి చేరుకుంది.  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 261.55 పాయింట్లు పడిపోయి 24,683.90కి చేరుకుంది.  దీంతో పెట్టుబడిదారుల సంపద రూ.5.64 లక్షల కోట్లు తగ్గింది. భారత్​,-అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరింత స్పష్టత కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తూ లాభాల బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నారని ఎనలిస్టులు తెలిపారు.

సెన్సెక్స్ సంస్థలలో, ఎటర్నల్ అత్యధికంగా 4.10 శాతం పడిపోయింది. మారుతి, మహీంద్రా అండ్​ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్,  ఆసియన్ పెయింట్స్ కూడా వెనకబడి ఉన్నాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 1.26 శాతం, ఇండెక్స్ మేజర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.13 శాతం తగ్గాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్,  ఐటీసీ లాభపడ్డాయి.

బీఎస్​ఈ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.65 శాతం, స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.96 శాతం పడిపోయాయి. పాజిటివ్​ ట్రిగ్గర్లు లేకపోవడానికి తోడు యూఎస్​ ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ప్రాఫిట్​ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నారని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. 

సెక్టోరల్​ సూచీలన్నీ నష్టాల్లోనే..

బీఎస్​ఈలో అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఆటో 2.13 శాతం, కన్జూమర్​ డిస్క్రెషనరీ 1.81 శాతం, యుటిలిటీస్ 1.64 శాతం, సేవలు 1.53 శాతం, ఇండస్ట్రియల్​1.36 శాతం,  టెలికమ్యూనికేషన్ 1.35 శాతం పడ్డాయి. బీఎస్​ఈలో 2,531 స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్షీణించగా, 1,438 లాభాలు సంపాదించాయి.  ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్  హాంగ్ సెంగ్ లాభాల్లో ముగియగా, దక్షిణ కొరియా కోస్పి స్వల్పంగా నష్టపోయింది.

యూరప్ మార్కెట్లు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.11 శాతం తగ్గి బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 65.47 డాలర్లకు చేరుకుంది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) సోమవారం రూ.525.95 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. సోమవారం సెన్సెక్స్ 271.17 పాయింట్లు తగ్గి 82,059.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74.35 పాయింట్లు తగ్గి 24,945.45 వద్ద సెటిలయింది.