ఫిఫా వరల్డ్‌కప్‌కు షాకిస్తున్న ఎండలు.. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఫ్యాన్స్

ఫిఫా వరల్డ్‌కప్‌కు షాకిస్తున్న ఎండలు.. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఫ్యాన్స్

Heat Wave In FIFA World Cup 2026: అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి వస్తున్న ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ సవాలు ఎదురవుతుంది. ఆకాశం వైపు చూస్తే వాతావరణం అంత ప్రమాదకరంగా ఏమీ కనిపించకపోయినప్పటికీ, స్టేడియానికి చేరుకునే మార్గంలో కాంక్రీట్ భవనాలు, డంబార్ రోడ్ల నుంచి వస్తున్న ఎండ సెగలకి జనాలను భయపడుతున్నారు. ఈ వేడి కారణంగా నడవడానికి కూడా ఫ్యాన్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

వేడిని తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్: 
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులని చూసేందుకు స్టేడియాలకి తరలివెళ్తున్న అభిమానులు.. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతుండటంతో.. వెదర్ యాప్‌లను ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉష్ణోగ్రత సుమారు 32°C (90°F) గానే కనిపిస్తుంది.. కానీ, కింద ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌ల నుంచి వచ్చే వేడి మాత్రం ఏకంగా 50°C (122°F) డిగ్రీల వరకు రికార్డవుతుంది. పార్కింగ్ ప్లేసులు, రైల్వే స్టేషన్స్, ఓపెన్ గ్రౌండ్స్ నుంచి స్టేడియం వరకు నడుచుకుంటూ వచ్చే ఫ్యాన్స్ ఈ వేడిని భరించలేకపోతున్నారు. డంబార్ రోడ్లు వేడిని త్వరగా పీల్చుకుని, తిరిగి అంతే స్పీడ్ గా పైకి వదిలి పెట్టడంతో.. గాలి కంటే భూమి పైన హీట్ ఎక్కువగా వస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 

కాంక్రీట్ జంగిల్ వల్లే అధిక ఉష్ణోగ్రతలు: 
గతంలో జరిగిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. డల్లాస్ నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో పర్యావరణ పరిస్థితులను బట్టి ఉష్ణోగ్రతల్లో 5.6°C (10°F) డిగ్రీల వరకు తేడాలు ఉంటాయని తేలింది. పెద్ద పెద్ద పార్కింగ్ లాట్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న చోట కాంక్రీట్ ఎఫెక్ట్ తో వేడి ఎక్కువగా ఉంది. ఇక చెట్లు, పచ్చదనం ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉండటం రిలీఫ్ కలిగిస్తున్నాయని వాతావరణ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కాంక్రీట్ జంగిల్ వల్లే ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లు చూసేందుకు వచ్చే ఫ్యాన్స్ కొంపముంచుతోంది.

అభిమానుల జేబులకి చిల్లు: 
ఫుట్ బాల్ మ్యాచ్‌లు చూడటానికి వచ్చిన అభిమానులు కూడా ఇక్కడి వాతావరణం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అర్జెంటీనా నుంచి వచ్చిన మాథియాస్ అనే ఫ్యాన్ మాట్లాడుతూ.. నడుస్తున్నంత సేపు బాగానే ఉన్నప్పటికీ, కాసేపు ఆగగానే చుట్టూ బిల్డింగుల నుంచి వచ్చే హీట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని తెలిపింది. స్వీడన్‌కు చెందిన విక్టర్ అనే మరో అభిమాని సైతం ఎండలో కాసేపు నడిస్తేనే శరీరం సహకరించట్లేదని వెల్లడించింది. 

ఒక్కో వాటర్ బాటిల్ రూ. 500: 
డల్లాస్-ఫోర్ట్ వర్త్  నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాలలో తాగునీటి కేంద్రాలని ఏర్పాటు చేసినప్పటికీ, మ్యాచ్‌లు జరిగే స్టేడియంలో మాత్రం చల్లదనాన్ని ఇచ్చే ఏర్పాట్లు చాలా తక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. స్టేడియం బయట పెద్ద పెద్ద ఫ్యాన్లు, మంచు కురిపించే సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉచిత తాగునీరు ఎక్కడా ఈజీగా దొరకడం లేదు, బయట ఒక్కో వాటర్ బాటిల్‌ను 4 నుంచి 5 డాలర్ల (సుమారు రూ.350 నుంచి రూ.400) కు అమ్ముతున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. 

ALSO READ : మా దగ్గర ఐదు వరల్డ్‌కప్‌లు ఉన్నాయి..

ఆ ఒక్క విషయంలో ఫ్యాన్స్ కి రిలీఫ్: 
అభిమానులకు బిగ్ రిలీఫ్ ఏమిటంటే.. డల్లాస్‌లో జరిగే వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లన్నీ ఇండోర్ స్టేడియంలోనే జరుపుతున్నారు. దీంతో మ్యాచ్ చూసేటప్పుడు ఫుట్ బాల్ అభిమానులకు ఎండల నుంచి పూర్తి రక్షణ దొరుకుతుంది. కేవలం స్టేడియం బయట నడిచేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ నీళ్లు తాగుతూ, గొడుగులని ఉపయోగించుకుని తమ శరీరాన్ని కాపాడుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.