మంత్రి కేటీఆర్ కు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆహ్వానం

V6 Velugu Posted on Oct 13, 2021

ప్రాన్స్ ప్రభుత్వం తమ సెనెట్ లో ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. ఈ నెల 29న ఫ్రాన్స్ సెనెట్ లో జరిగే ఆంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని మాట్లాడాల్సిందిగా విజ్ణప్తి చేసింది. 

అంబిషన్ ఇండియా– 2021 సదస్సులో కీనోట్ స్పీకర్ గా పాల్గొని గ్రోత్–డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్ అనే అంశంపై తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం కోరింది.

ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఇమ్మాన్యుల్ మాక్రోన్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ఈ సదస్సు భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది.

Tagged government, France, Invitation, Minister KTR  

Latest Videos

Subscribe Now

More News