ఉచిత డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: తెలంగాణ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టైడ్స్ ) ఆధ్వర్యంలో లైట్ మోటార్ వెహికల్(ఎల్ఎం వీ), హెవీ మోటార్ వెహికల్ (హెచ్ఎంవీ)లో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టైడ్స్  ప్రిన్సిపాల్  రాఘవన్ తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన, ఎంప్లాయ్​మెంట్​జనరేషన్ , మార్కెటింగ్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత శిక్షణ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి టైడ్స్ లో ఉంటుందన్నారు.

ఉచిత వసతి సౌకర్యం ఉంటుందని, ట్రైనింగ్​కు దరఖాస్తు చేసుకునే  అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెంది10 వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా పర్వాలేదన్నారు. అభ్యర్థి ఎత్తు 160 సెంటిమీటర్ల పైన ఉండి, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న వారికి మూడు నెలలపాటు అప్రెంటిస్ ఉంటుందన్నారు.

ఎల్ఎంవీ లైసెన్స్ ఏడాది పూర్తయిన వారికి హెచ్ఎంవీలో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎస్సెస్సీ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డ్, కులం, ఆదాయం, బ్యాంక్ ఖాతా జిరాక్స్ లు, 6 ఫొటోలతో రావాలన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉందని, వివరాలకు 89854 31720 నంబర్​లో సంప్రదించాలని తెలిపారు.