- వర్షంతో ఫలితం తేలని బెంగళూరు–రాజస్థాన్ మ్యాచ్
- రాజస్థాన్ ఖేల్ ఖతమే!
- ప్లేఆఫ్ రేసు నుంచి ఆర్‌సీబీ ఔట్
ఐదు ఓవర్ల మ్యాచ్. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ , ఏబీ డివిలియర్స్. తొలి తొమ్మిది బంతుల్లోనే 35 రన్స్ వచ్చేశాయి. ఈ జోరు కొనసాగితే బెంగళూరు వందరన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనిపించింది. కానీ, అంతలోనే భారీ కుదుపు. రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లతో హ్యాట్రిక్ నమోదు చేసిన శ్రేయస్ గోపాల్ కోహ్లీ సేన జోరుకు బ్రేకులేశాడు. చివరకు ఆర్ సీబీ 62 రన్స్ చేసింది. ఛేజింగ్ లో సంజు శాంసన్ దంచికొట్టడంతో 3.2 ఓవర్లకు 41/1తోనిలిచిన రాయల్స్ సులువుగా మ్యాచ్ నెగ్గేలా కనిపించింది. కానీ, మరో అనూహ్య పరిణామం. ఈసారి బెంగళూరు మాయ చేయలేదు. వర్షం మళ్లీ వచ్చింది. దాంతో, మ్యా చ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు కోల్పోయిన కోహ్లీసేన రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. రాజస్థాన్ ఆశలు కూడా దాదాపు ఆవిరయ్యాయి. మరో మ్యా చ్ ఆడాల్సిన రాయల్స్ 11పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. సాంకేతికంగా ఆ జట్టు రేసులో ఉన్నా అద్భుతం జరిగితే తప్ప రాయల్స్ ప్లే ఆఫ్ లో కనిపించడం కష్టమే.
మంగళవారం వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 7 వికెట్లకు 62 రన్స్ చేసింది. విరాట్‌కోహ్లీ (7 బంతుల్లో 1 ఫోర్ , 3 సిక్సర్లతో 25) ఇన్నింగ్స్ ఆరంభంలో మెరుపులు మెరిపించడంతో ఆర్ సీబీ ఆమాత్రం స్కోరు అయినా చేయగలిగింది. రెండో ఓవర్ చివరి మూడు బంతులకు కోహ్లీ , డివిలియర్స్(10),స్టొయినిస్(0)ను ఔట్ చేసిన శ్రేయస్ గోపాల్ (3/12)హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం ఛేజింగ్ లో రాజస్థాన్ 3.2 ఓవర్లకు 41/1తో నిలిచిన దశలో వర్షం మళ్లీ రావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. సంజుశాంసన్ (13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 28)రాణించాడు.
విరాట్ మెరుపులు.. గోపాల్ కట్టడి
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్‌కు ఓపెనర్లు విరాట్ కోహ్లీ , ఏబీ డివిలియన్స్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వరుణ్ వేసిన ఫస్ట్ ఓవర్‌లో తొలి రెండు బంతులను కోహ్లీ సిక్సర్లుగా మలచగా, ఆ తర్వాత డివిలియర్స్ రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో 23పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో కెప్టెన్ స్మిత్ అనూహ్యంగా స్పిన్నర్ గోపాల్ ను బౌలింగ్‌కు దింపాడు.అతని తొలి రెండు బంతుల్లో సిక్సర్ , ఫోర్ బాదిన విరాట్ మూడో బాల్ కు డబుల్ తీశాడు. ఈ లెక్కన ఆర్‌సీబీ మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ,తర్వాతి మూడు బంతుల్లో కోహ్లీ , డివిలియర్స్, స్టొయినిస్‌ను ఔట్ చేసిన శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ తో బెంగళూరుకు షాకిచ్చాడు. తర్వాత పరుగులు తీసేందుకు చాలెంజర్స్ బ్యాట్స్‌మెన్ ఇక్కట్లు పడ్డారు. షాట్లపైనే దృష్టి పెట్టి వికెట్లు ఇచ్చుకున్నా రు. మరో లెగ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ మూడో ఓవర్లో పది పరుగులిచ్చి గుర్ కీరత్ సింగ్ (6)ను ఔట్ చేశాడు. నాలుగో ఓవర్లో పార్థివ్ పటేల్ (8)ను పెవిలియన్ చేర్చిన ఉనాద్కట్ 9 రన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ వేసిన థామస్ ఎనిమిది పరుగులిచ్చి క్లాసన్ (6), నేగి(4) వికెట్లు తీయడంతో బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
శాంసన్ ధనాధన్
ఛేజింగ్ ను రాజస్థాన్ నెమ్మదిగా ఆరంభించింది.ఉమేశ్ వేసిన తొలి ఓవర్ లో సంజు శాంసన్ 6, 4 కొట్టడంతో కేవలం పది పరుగులే వచ్చాయి. సైనీ వేసిన రెండో ఓవర్ రోలివింగ్ స్టోన్ 4, 6 కొట్టినా మొత్తం 12పరుగులే వచ్చాయి.దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 22 రన్స్ చేసింది. ఖెజ్రోలియా వేసిన మూడో ఓవర్ ఫస్ట్ బాల్ కు సిక్స్ కొట్టిన సంజు.. చివరి రెండు బంతుల్లో 6, 4 కొట్టడంతో రాజస్థాన్ విజయానికి 23 రన్స్ దూరంలో నిలిచింది. నాలుగో ఓవర్‌లో శాంసన్‌ను ఔట్ చేసిన చహల్ బెంగళూరు శిబిరంలోఆశలు రేపాడు. అయితే మరోసారి వాన ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను పూర్తిగా నిలిపివేశారు. లివింగ్ స్టోన్ (12 నాటౌట్ ) అజేయంగా నిలిచాడు.
స్కోర్ బోర్డు
బెంగళూరు : కోహ్లీ (సి ) లివిం గ్ స్టో న్ (బి)గోపాల్ 25, డివిలియర్స్ (సి ) రియాన్ (బి)గోపాల్ 10, స్టొయినిస్ (సి) స్మిత్ (బి) గోపాల్0, క్లా సెన్ (సి ) లివిం గ్ స్టో న్ (బి) థా మస్ 6,గుర్ కీరత్ (సి ) మహిపాల్ (బి) రియాన్ 6,పార్ థివ్ (సి) థామస్ (బి) ఉనాద్కట్ 8, నేగి (సి)శాం సన్ (బి) థా మస్ 4; ఉమేశ్ (నాటౌట్ )0, సైనీ (నాటౌట్ )0 : ఎక్స్ ట్రాలు :3 ;మొత్తం :5 ఓవర్లలో 62/7;
వికెట్ల పతనం:1–35, 2–35, 3–35, 4–44, 5–54,6–57, 7–61 బౌలింగ్ : వరుణ్ 1–0–23–0, గోపాల్ 1–0–12–3, రియాన్1–0–10–1, ఉనాద్కట్ 1–0–9–1, థామస్ 1–0–6-–2.
రాజస్థాన్ రాయల్స్ : శాంసన్ (సి) నేగి(బి)చహల్28, లివింగ్ స్టో న్ (నాటౌట్)12,ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 3.2 ఓవర్లలో 41/1,
వికెట్ పతనం: 1–41,- బౌలింగ్ : ఉమేశ్-1–0–10–0, సైనీ1–0–12–0, ఖెజ్రోలియా1–0–17–0, చహల్0.2–0–0–1.

