హైదరాబాద్ వివాహితకుమిసెస్ కాన్ఫిడెంట్ టైటిల్.. ఢిల్లీలో మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ పోటీలు

హైదరాబాద్ వివాహితకుమిసెస్ కాన్ఫిడెంట్ టైటిల్..  ఢిల్లీలో మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ పోటీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌కు చెందిన సిప్రా మల్లిక్ ఢిల్లీలో జరిగిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్–2026  సీజన్-4  నేషనల్ ఫైనల్స్‌‌‌‌లో  మిసెస్ కాన్ఫిడెంట్ టైటిల్‌‌‌‌ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్‌‌‌‌‌‌‌‌గావ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి వేదికపై దేశవ్యాప్తంగా ఉన్న వివాహిత మహిళలను వెనక్కినెట్టి ఆమె ఈ విజయాన్ని సాధించారు. బేగంపేట కంట్రీ క్లబ్‌‌‌‌లో శుక్రవారం మీట్అండ్ గ్రీట్‌‌‌‌లో సిప్రా మల్లిక్ మాట్లాడుతూ.. ప్రతీ మహిళ తన కంఫర్ట్ జోన్‌‌‌‌ను దాటి తనలోని సామర్థ్యాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు.