కరీంనగర్, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు, కల్వర్టుల అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 8 పనులకు రూ.11 కోట్లు కేటాయించింది.
చిగురుమామిడి మండలం గాజాబండలో క్రాస్ డ్రైనేజ్(సీడీ) వర్క్స్ కు రూ.50 లక్షలు, రిటైనింగ్ వాల్ కు రూ.40 లక్షలు, రేకొండలో శ్మశాన వాటిక పనులకు రూ.కోటి, పేచుపల్లి–పర్లపల్లి మధ్య సీడీ పనులకు రూ.80 లక్షలు, నవాబ్‌పేట్–పొట్లపల్ల మధ్య సీడీ వర్క్స్ కు 2.30 కోట్లు మంజూరయ్యాయి.
సైదాపూర్ మండలం సోమారం ఎక్స్ రోడ్ -రైకల్(సైదాపూర్ మీదుగా) స్లాబ్ కల్వర్టులకు 1.25 కోట్లు, సైదాపూర్ మండలం దుద్దెనపల్లి మొగిలిపాలెం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.50 కోట్లు, సైదాపూర్ మండలం గొడిశాల నల్లరామయ్యపల్లి మీదుగా సీడీ పనులకు 1.25 కోట్లు కేటాయించారు.
సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రి పొన్నం కృతజ్ఞతలు
హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి, బ్రిడ్జిల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు కావడంపై హుస్నాబాద్ ఎమ్మల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, సంబంధిత శాఖ మంత్రులకు ధన్యవా దాలు తెలిపారు.
