బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర(మిడ్ మానేరు) ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి శుకక్రవారం నీటిని విడుదల చేశారు. కరీంనగర్ ప్రాంత తాగునీటి అవసరాలకు మిడ్ మానేరు నుంచి నాలుగు గేట్లు ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 16,571 క్యూసెక్కుల వరద వస్తుండగా అందులో ఎల్లంపల్లి నుంచి 12,600, మూల, మానేరు వాగుల ద్వారా 3,971 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతోంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ పూర్తి కెపాసిటీ 27.55 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 19.595 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
