జాతీయ స్థాయిలో టెండర్లకు హైడ్రాకు అనుమతి.. హైదరాబాద్ లో చెరువుల పునరుద్దరణ

జాతీయ స్థాయిలో  టెండర్లకు హైడ్రాకు అనుమతి.. హైదరాబాద్ లో చెరువుల పునరుద్దరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు సంబంధించి హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అనుమతినిచ్చింది. చెరువుల పునరుద్ధరణ పనులకు జాతీయ స్థాయిలో టెండర్లు ఆహ్వానించేందుకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, చెరువుల పునరుద్ధరణ పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని హైడ్రా కమిషనర్‌‌ను ఆదేశించింది. ఇదివరకు చెరువుల పనులను తెలంగాణ పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల్లో రిజిస్టర్ అయిన ఏజేన్సీలు మాత్రమే చేసేవి. ఇకపై జాతీయ స్థాయిలో ప్రభుత్వ శాఖాల్లో రిజస్టర్ అయిన ఏజేన్సీలు టెండర్లలో పాల్గొనే అవకాశం కలిగింది.