- తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్
ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13న జనవిహార్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, సంజీవ్ నాయక్, మందాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
